ఒలింపిక్స్‌.. తొలి స్వర్ణం వారి ఖాతాలోనే..

కరోనా సమయంలోనూ ఒలింపిక్స్‌ గ్రాండ్‌గా ప్రారంభం అయ్యాయి.. ఇక, పతకాల వేట కూడా ప్రారంభం అయ్యింది… ఎప్పుడూ పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండే డ్రాగన్‌ కంట్రీ.. ఈసారి టోక్యోలో జరుగుతోన్న ఒలింపిక్స్‌లో కూడా శుభారంభం చేస్తూ.. తొలి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది.. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో చైనాకు చెందిన యాంగ్‌ కియాన్‌ విక్టరీ కొట్టింది.. రష్యన్‌ షూటర్‌ గలాషినా అనస్టాసియాను స్వల్ప తేడాతో ఓడించింది. అర్హత రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన డ్యూస్టాడ్‌ నాలుగో షూటర్‌గా వెనుదిరిగింది. ఇక, ఫైనల్‌ పోరు హోరాహోరీగా సాగగా.. యాంగ్‌, అనస్టాసియా నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డారు.. 125.6-126.0, 147.3-146.2, 168.3-167.6, 188.9-189.1, 210.0-210.5, 231.3-231.4తో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీనే నడవగా.. అనస్టాసియా 10.8 పాయింట్లు రాగా.. యాంగ్‌ 10.7కే పరిమితం అయ్యారు.. అయితే చివరి షూట్లో యాంగ్‌ 9.8, రష్యన్‌ స్టార్‌ 8.9 పాయింట్లు సాధించడంతో వీరి మధ్య తేడా 251.8 – 251.1గా మారిపోయింది. దీంతో యాంగ్‌ కియాన్‌ను పసిడి పతకం వరించింది.. అనస్టానియా రజతం దక్కించుకోగా.. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రిస్టినా నీనా 230.6తో కాంస్యం సాధించారు.

Related Articles

Latest Articles

-Advertisement-