లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: జియాంగ్ సిటీలో వ‌స్తుమార్పిడి ప‌ద్ద‌తి…

క‌రోనాకు పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పుడు క్ర‌మంగా కేసులు పెరుగుతున్నాయి.  వూహాన్ న‌గ‌రంలో పుట్టిన క‌రోనా, ప్ర‌పంచం మొత్తం వ్యాపించింది.  గ‌త మూడేళ్లుగా క‌రోనాతో ప్ర‌జ‌లు సహ‌జీవ‌నం చేయాల్సి వ‌స్తున్న‌ది.  వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా లాభం లేకుండా పోతున్న‌ది.  డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల వ్యాప్తితో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు.  ఇదిలా ఉంటే, చైనాలో రెండు మూడు కేసులు న‌మోదైన న‌గ‌రాల్లో క‌ఠిన‌మైన లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నారు.  ప్ర‌జ‌లెవ‌రినీ బ‌య‌ట‌కు రానివ్వ‌డంలేదు.  గ‌త రెండు వారాలుగా జియాంగ్ సిటీ లాక్‌డౌన్‌లో ఉన్న‌ది.  మూడు రోజుల‌కు ఒక‌సారి మాత్ర‌మే బ‌య‌ట‌కు అనుమ‌తిస్తున్నారు.

Read: క‌జికిస్తాన్‌లో ప్యూయ‌ల్ ర‌గ‌డ‌…బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న ప్ర‌భుత్వం…

దీంతో చాలా మంది ప్ర‌జ‌లు ఆహారం కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు.  పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్ల‌లో ఉండే ప్ర‌జ‌లు ఒక‌రికొకు స‌హాయం చేసుకుంటున్నారు.  వ‌స్తుమార్పిడి ప‌ద్ద‌తి ద్వారా ఆహారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు.  రైస్ ప్యాకెట్ కు స్మార్ట్ ఫోన్లు, కూర‌గాయ‌ల కోసం సిగరేట్ ప్యాకెట్లు, ఇర‌త వ‌స్తువుల కోసం కొన్ని విలువైన వ‌స్తువుల‌ను మార్పిడి చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ జీవ‌నం సాగిస్తున్నారు.  ఎప్ప‌టి వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి అని, అప్ప‌టి వ‌ర‌కు జీవ‌నం సాగించాలంటే వ‌స్తువుల‌ను ఇలా ఇచ్చిపుచ్చుకోవ‌డం మిన‌హా మ‌రేమి చేయ‌లేమ‌ని చెబుతున్నారు ప్ర‌జ‌లు.  దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. 

Related Articles

Latest Articles