తైవాన్ ఎఫెక్ట్‌: అమెరికాకు చైనా వార్నింగ్‌…

అమెరికా.. చైనా దేశాల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది.  ఆసియా ఖండంలో ఆధిప‌త్యం చ‌లాయించేందుకు చైనా ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.  గ‌త రెండు ద‌శాబ్దాల కాలంలో చైనా ఆర్థికంగా వేగంగా అభివృద్దిచెందింది.  అప్ప‌టి వ‌ర‌కు అగ్ర‌రాజ్యంగా ఉన్న అమెరికా ఆధిప‌త్యాన్ని ప్ర‌శ్నించే స్థాయికి చైనా ఎదిగింది.  ఆర్థిక ఎదుగుద‌ల‌తో పాటుగా  చైనా విస్త‌ర‌ణ‌పై దృష్టి సారించ‌డంతో స‌రిహ‌ద్దు దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి.  ఇప్ప‌టికే టిబెట్‌, హాంకాంగ్‌పై ప‌ట్టు సాధించిన చైనా దృష్టి తైవాన్‌పై ప‌డింది.  వ‌న్ చైనాలో భాగంగా తైవాన్‌ను చైనాలో క‌లిపేసుకోవాల‌ని చూస్తున్న‌ది.  దీనిని అమెరికా పూర్తిగా వ్య‌తిరేకిస్తుండ‌టంతో రెండు దేశాల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ది.  

Read: స్పేస్ వార్‌: శాటిలైట్‌ను పేల్చివేసిన ర‌ష్యా…

చాలా కాలం త‌రువాత అమెరికా, చైనా అధ్య‌క్షులు వ‌ర్చువ‌ల్‌గా క‌లుసుకున్నారు.  వీడియో లింక్ ఆధారంగా రెండు దేశాల నేత‌ల స‌మావేశం జ‌రిగింది.  దాదాపుగా మూడున్నర గంట‌ల పాటు ఈ స‌మావేశం కొన‌సాగింది.  తైవాన్ ను స్వ‌తంత్య్ర దేశంగా గుర్తించాల‌ని, ఆ దేశంలో శాంతికి విఘాతం క‌లిగించ‌కుండా చూడాల‌ని అమెరికా కోర‌గా దానిని పూర్తిగా చైనా వ్య‌తిరేకించింది.  తైవాన్ స్వ‌తంత్య్రం కోసం మాట్లాడితే నిప్పుతో చెల‌గాటం అడిన‌ట్లే అవుతుంద‌ని ప‌రోక్షంగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది.  తైవాన్ విష‌యంలో త‌మ వైఖ‌రిలో మార్పులేద‌ని చైనా చెబుతుంటే, తైవాన్‌లో శాంతికి విఘాతం క‌లిగిస్తే ఆ దేశం త‌రుపున పోరాటం చేస్తామ‌ని అమెరికా చెబుతున్న‌ది.  

Related Articles

Latest Articles