గాల్వన్ లోయ‌లో మ‌ళ్లీ అల‌జ‌డి… డ్రాగ‌న్ జెండాను ఎగ‌రేసిన పీఎల్ఏ…

గ‌తేడాది గాల్వ‌న్ లోయ‌లో చైనా సైనికులు ప‌హారా కాస్తున్న భార‌త సైన్యంపై ప‌దునైన ఆయుధాల‌తో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే.  నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా చైనీయులు దాడి చేయ‌డంతో దానికి భార‌త్ కూడా త‌గిన విధంగా బ‌దులు చెప్పింది.  ఈ ర‌గ‌డ త‌రువాత రెండు దేశాల మ‌ధ్య ప‌చ్చ‌గడ్డి వేసినా భ‌గ్గుమంటోంది.  గాల్వ‌న్ భూభాగం త‌మ‌దే అంటూ చైనా ప‌దేప‌దే చెబుతూ వ‌స్తున్న‌ది.  భార‌త్ దానికి ధీటుగా జ‌వాబు ఇస్తూనే ఉన్న‌ది.  ఇటీవ‌లే చైనా ఆరుణాల్ ప్ర‌దేశ్ లోని 15 ప్రాంతాలు త‌మ‌వే అంటూ వాటికి చైనా భాష‌లో పేర్ల‌ను పెట్టింది.  దీనిపై భార‌త్ త‌గిన విధంగా స్పందించిన సంగ‌తి తెలిసిందే.  

Read: రైల్వేశాఖ కీల‌క నిర్ణ‌యం: బెంగ‌ళూర్‌-హైద‌రాబాద్ మ‌ధ్య బుల్లెట్ ట్రైన్‌…

ఇక ఇదిలా ఉంటే, జ‌న‌వ‌రి 1 వ తేదీన చైనా మ‌రింత ముందుకు వ‌చ్చి గాల్వ‌న్ లోయ‌లో డ్రాగ‌న్ జాతీయ జెండాను ఎగ‌ర‌వేసింది.  గాల్వ‌న్‌లో ఒక్క అంగుళం కూడా వ‌ద‌ల‌బోమ‌ని స్పష్టం చేసింది.  ఎగ‌రేసిన జాతీయ సెండాకు ప్ర‌త్యేక‌త ఉంద‌ని, గాల్వ‌న్‌లో ఎగ‌రేసిన జెండా బీజింగ్‌లోని ప్ర‌ముఖ కార్యాల‌యం మీద ఎగిరిన జెండా అని చెప్పుకొచ్చింది.  దీనిపై ప్ర‌తిప‌క్ష పార్టీలు పెద్ద ఎత్తున ర‌గ‌డ చేస్తున్నాయి.  చైనా ఆగ‌డాల‌కు చెక్ పెట్టాల‌ని,  ఇండియ‌న్ ఆర్మీలో ధైర్యాన్ని నింపేలా ప్ర‌ధాని స్పందించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.  ప్ర‌ధాని మౌనంగా ఉంటే చైనా అర్మీ మ‌రింత రెచ్చిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

Related Articles

Latest Articles