నేడు వరంగల్​, యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్​

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ నేడు వరంగల్‌, యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యంత ఆధునిక వైద్య సేవలతో ఏర్పాటు చేయనున్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌, ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన భవనాలను ప్రారంభించనున్నారు. నేడు వరంగల్‌ జిల్లా పర్యటన ముగించుకుని కేసీఆర్‌ యాదాద్రికి చేరుకుంటారు. ఇప్పటికే యాదాద్రి నూతన ఆలయ పునర్నిర్మాణాల పనులను సీఎం పరిశీలించారు. యాదాద్రి పర్యటన అనంతరం రేపు ఇదే జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించనున్నారు. ఇందుకు గాను అధికారులు వాసాలమర్రిలో ఏర్పాట్లను పరిశీలించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-