ఐపీఎల్ 2021 : చెన్నై లక్ష్యం…?

ఐపీఎల్ 20 21 ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా(60) అర్థ శతకం తో రాణించగా కెప్టెన్ పంత్(51) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక షిమ్రాన్ హెట్మీర్ 37 పరుగులతో ఆకట్టుకున్నాడు. అలాగే చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్‌వుడ్ రెండు వికెట్లు, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్లో చెన్నై విజయం సాధించాలంటే 173 పరుగులు చేయాలి. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ బౌలర్లు రాణిస్తుండటంతో అది కొంచెం కష్టమే. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారే ఐపీఎల్ 2021 లో మొదట ఫైనల్స్ కు వెళ్ళిన జట్టు గా నిలుస్తారు.

-Advertisement-ఐపీఎల్ 2021 : చెన్నై లక్ష్యం...?

Related Articles

Latest Articles