బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్

దళితులను తమిళ ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని నటి, బిగ్‏బాస్ బ్యూటీ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. కాగా, ఆమె హాజరు కాకపోయేసరికి అరెస్ట్ అవుతుందంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. నన్ను అరెస్ట్ చేయడం మీ కల.. అది జరిగే పని కాదని కామెంట్స్ చేసింది. ఒకవేళ సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ చేసింది. సీన్ కట్ చేస్తే.. తాజాగా మీరా మిథున్ ను కేరళలో అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను చెన్నైకి తరలిస్తున్నారు.

-Advertisement-బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్

Related Articles

Latest Articles