చెన్నై బృహ‌త్త ప్ర‌ణాళికః 72 రోజుల్లోనే టీకా…

చెన్నైలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేశారు.  మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ వేయించేకోవ‌డం ఒక్క‌టే మార్గం కావ‌డంతో చెన్నై యువ‌త ఎక్కువ‌గా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌కు త‌ర‌లి వ‌స్తున్నారు.  ప్ర‌స్తుతం న‌గ‌రంలో 65 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  కాగా, మ‌రింత వేగంగా వ్యాక్సిన్‌ను వేసేందుకు చెన్నై కార్పోరేష‌న్ బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌ను సిద్దం చేసింది.  న‌గరంలోని మొత్తం 200 వార్డుల్లో 200 సంచార వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి వ్యాక్సినేష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  

Read: ‘లైగర్’ ఓటీటీ ఆఫర్ పై విజయ్ దేవరకొండ క్లారిటీ

ఈ వ్యాక్సినేష‌న్ కోసం ప్ర‌త్యేక యాప్ ను సిద్దం చేస్తున్నది.   యాప్‌లో వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్నవారికి వ్యాక్సిన్ ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.  72 రోజుల్లోగా న‌గ‌రంలోని 18 ఏళ్లు నిండిన యువ‌త అంద‌రికీ వ్యాక్సిన్ అందించాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసిన‌ట్టుగా చెన్నై కార్పోరేష‌న్ క‌మీష‌న‌ర్ గ‌గ‌న్ దీప్ సింగ్ భేడీ పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-