మిడ్ వీక్ లో చెర్రీ, ఉపాసన లంచ్ బ్రేక్!

ఎవరి రంగాల్లో వాళ్ళు బిజీబిజీ గా ఉన్నప్పుడు కలిసి భోజనం చేయడం కూడా కష్టమే. అయితే కొందరు ప్రొఫెషన్ పరంగా బయట ఎన్ని గంటలు ఉన్నా… లంచ్ లేదా డిన్నర్ మాత్రం కలిసే చేయాలని అనుకుంటారు. కానీ సినిమా వాళ్ళ విషయానికి వచ్చే సరికీ అది జరగని పని. అందుకే కొందరు స్టార్ కపుల్ ఆటవిడుపుగా వీకెండ్ లో లంచ్ లేదా డిన్నర్ బయట చేస్తుంటారు. కానీ చిత్రంగా రామ్ చరణ్ అండ్ ఉపాసన మాత్రం మిడ్ వీక్ లో లంచ్ బ్రేక్ లో కలిసి ముచ్చట్లు మొదలెట్టారు. ఆ ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలే రామ్ చరణ్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి ప్రముఖ దర్శకుడు శంకర్ ను చెన్నయ్ లో కలిసి కొత్త ప్రాజెక్ట్ గురించి ముచ్చటించారు. బహుశా ఆ విశేషాలన్నీ లంచ్ చేస్తూ చెర్రీ.. ఉపాసనకు చెప్పే ఉంటారు… ఎందుకంటే లంచ్ పేరుతో ఓ గంట క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేయడం కూడా ఈ రోజుల్లో గ్రేటే కదా!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-