అలర్ట్ : ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు

కోవిడ్ కారణంగా మార్పులు చేసిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి జిల్లా కార్యాలయాలు ఇతర ఉపకార్యాలయాలు ఉదయం 10.30 గంటల నుంచి ఐదు గంటల వరకూ పనిచేస్తాయని స్ఫష్టం చేసింది జగన్‌ ప్రభుత్వం. సచివాలయంతో పాటు విభాగాధిపతులు, ఇతర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేస్తాయని స్పష్టం చేశారు.

read also : రేపే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా : కౌశిక్‌ రెడ్డి

జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం మాత్రమే సెలవు ఉంటుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, విభాగాధిపతులు, కార్పోరేషన్లకు సంబంధించి రాష్ట్ర కార్యాలయాలు మరో ఏడాది పాటు వారానికి ఐదు రోజులే పనిచేస్తాయని వెల్లడించింది ప్రభుత్వం. కోవిడ్ ప్రభావం స్వల్పంగా తగ్గటంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-