ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జన గణన చేపట్టాలని ప్రధానిని లేఖలో కోరారు చంద్రబాబు. బీసీలకు సంబంధించిన సరైన డేటా లేకపోవడంతో ఆ వర్గాలకు అన్యాయం జరుగుతోందని… ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా బీసీలు అన్ని రకాలుగా వెనకబడే ఉంటున్నారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. బీసీ జన గణన పక్కాగా జరిగితేనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతాయని.. బీసీ జన గణన చేపట్టాలని గత ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీలో ఏకగ్రీన తీర్మానం చేసి కేంద్రానికి పంపామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కులాల వారీగా అందుబాటులో ఉన్న జనగణన వివరాలు 90 ఏళ్ల క్రితానివి.. అది ఇప్పుడు పనికి రాదని చెప్పారు. దీనిపై ప్రధాని మోడీ వెంటనే స్పందించాలని కోరారు చంద్రబాబు.

Related Articles

Latest Articles