చంద్రబాబుని వదలని వరద.. మునిగిన ఇల్లు

వాన కష్టాలు మాజీ సీఎం చంద్రబాబునాయుడిని వదల్లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచెత్తింది భారీ వరద నీరు. ఇంటి వెనుక పొలాలపై నుంచి వచ్చిన వరద ఇంటిని చుట్టుముట్టడంతో భద్రతా సిబ్బంది గదితో పాటు ఉద్యానవనం మునిగిపోయింది.

గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోక పోవడంతో సర్పంచ్ లక్ష్మీ భర్త గిరినాయుడు, చంద్రబాబు సోదరుడు సుబ్రహ్మణ్యం నాయుడు సాయంతో నీరు బయటకు పంపిస్తున్నారు.భారీవర్షం కారణంగా రేపు టీటీడీ కార్యాలయానికి సెలవు ప్రకటించారు ఇఓ జవహర్ రెడ్డి. రేణిగుంట కడప జాతీయ రహదారి శ్రీనివాసపురం ఆంజనేయపురం వద్ద వరద ధాటికి కూలిపోయే స్థితిలో వుంది వంతెన.

వంతెన మధ్యలో ఇరుక్కున్న లారీ ఏ క్షణాన లారీ వరదలో పడిపోతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరువైపులా స్తంభించిన ట్రాఫిక్ తో జనం, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తిరుపతి శ్రీనివాసమంగాపురం సమీపంలో స్వర్ణముఖి వాగులో కొట్టుకు వెళ్ళింది ఓ ఆటో. సకాలంలో స్పందించి జేసీబీ సాయంతో డ్రైవర్ ను ఒడ్డుకు చేర్చారు చంద్రగిరి పోలీసులు. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Latest Articles