హత్యా రాజకీయాలు నేను ప్రోత్సహించను: చంద్రబాబు

మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నేత చంద్రయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. చంద్రయ్య మృతదేహం గుండ్లపాడుకు తరలించారు. గుండ్లపాడుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు. గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. చంద్రయ్య గ్రామ సెంటర్‌లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు పరారయ్యారు. చంద్రయ్య హత్యను చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.చంద్రయ్య హత్య బాధాకరమన్నారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. హత్యా రాజకీయాలు నేను ప్రోత్సహించనన్నారు. రౌడీలపై తీవ్రవాదులపై పోరాడిన చరిత్ర టీడీపీది. చెంచాలతో మాట్లాడించడం కాదు జగన్‌ రెడ్డి దమ్ముంటే నువ్వు రా.. అంటూ సవాల్‌ విసిరారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి నీ అడ్డుపెట్టుకుని జగన్ పల్నాడులో హత్యా రాజకీయాలకు చేస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు.


పల్నాడు నీ జాగీరు కాదు..మీరు పుడింగిలు కాదు.. మీరు పిరికి పందలు..పోలీసుల సహకారంతోనే మా కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. 22 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంది. నేను హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తే మీరు ఉండే వాల్లా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండకు పాల్పడుతోందని మండిపడ్డారు. పల్నాడులోనే ఇప్పటికే పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. స్థానిక ఎన్నికల టైంలో బోండా ఉమా, బుద్ధాపై దాడి చేశారని అన్నారు. గత దాడుల సమయంలోనే చర్యలు తీసుకుంటే అడ్డుకట్ట పడేదని తెలిపారు. దాడులు చేస్తే పదవులు కట్టబెట్టే విష సంస్కృతిని జగన్‌ చాటుకున్నారని విమర్శించారు. చంద్రయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

కార్యకర్త “పాడేమోసిన” చంద్రబాబు.

హత్యా రాజకీయాలు నేను ప్రోత్సహించను: చంద్రబాబు

హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య ఇంటి వద్దకు చేరుకొని,అంతిమ యాత్రలో చంద్రబాబు స్వయంగా పాల్గొని పాడే మోశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.


Related Articles

Latest Articles