వరి వేయద్దు అంటున్నారు, గంజాయి ఎయ్యాలా….?

జగన్‌ సర్కార్‌ పై మరోసారి రెచ్చి పోయారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతిలోని పాప నాయుడు పేట వద్ద వరద భాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వరి వేయద్దు అంటున్నారు, గంజాయి ఎయ్యాలా? అని నిప్పులు చెరిగారు. ప్రపంచంలో నే ఏపీ కి చెడ్డపేరు తెప్పిచ్చారని… ఇది ప్రజాస్వామ్యం కాదు. ఉన్మాద స్వామ్యమని నిప్పులు చెరిగారు. మడమ తిప్పను అని గిరగిరా తిప్పుతూనే ఉన్నాడు. తుగ్లక్ నయం ఈ జగన్ తుగ్లక్ కంటే అంటూ రెచ్చిపోయారు.

ఇది ప్రకృతి విలయం కాదు. జగన్ పట్టించుకోక పోవడం, ప్రభుత్వానికి ముందు చూపు లేక పోవడం వల్ల ఈ దుస్థితి అని నిప్పులు చెరిగారు. నేను సీఎం గా ఉన్నపుడు సంక్షోభంలో ఎలా స్పందించాను, ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజలు మంచి చెడు విశ్లేషించు కోవాలి. ధర్మాన్ని కాపాడాలని కోరారు. జగన్ మానసిక స్థితి బాగాలేదు. మాములు వ్యక్తి అలా ఉన్న పర్లేదు. ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి అలా ఉంటే అందరికి ప్రమాదమేనని చెప్పారు చంద్రబాబు నాయుడు.

Related Articles

Latest Articles