చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం: ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వ‌స్తా…

ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగంగా మారింది.  రెండోరోజు స‌మావేశాలు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు విమ‌ర్శ‌న‌ల‌తో నిండిపోయింది.  త‌న‌పైన‌, త‌న కుటుంబంపైనా స‌భ‌లో వైసీపీ నేత‌లు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తున్నార‌ని, త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా ఇబ్బంది పెట్టార‌ని, రెండున్న‌రేళ్లుగా ఎన్నోఅవ‌మానాలు భ‌రించాన‌ని, మ‌ళ్లీ స‌భ‌లోకి అడుగుపెడితే అది ముఖ్య‌మంత్రిగానే అని చెప్పి  స‌భ‌నుంచి వెళ్లిపోయారు.  

Read: ఇది రైతుల చారిత్రాత్మ‌క విజ‌యం… ఇప్ప‌టికైనా కేంద్రం…

చంద్ర‌బాబుతో పాటుగా పార్టీ ఎమ్మెల్యేలు కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.  బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు త‌న ఛాంబ‌ర్లో అత్య‌వ‌స‌రంగా టీడీఎల్పీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి టీడీపీ ఎమ్మెల్యేల‌తో పాటుగా మండ‌లి నుంచి లోకేష్‌, య‌న‌మ‌ల స‌హా ఇత‌ర ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు.  స‌భ‌లో వైసీపీ స‌భ్యుల తీరుపై చ‌ర్చించారు.  వైసీపీ స‌భ్యులు శృతిమించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఎమ్మెల్యేలు అభిప్రాయ‌ప‌డ్డారు.  కుటుంబంలోని మ‌హిళ‌ల వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేలా స‌భ‌లో వైసీపీ స‌భ్యులు కామెంట్లు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.  

Related Articles

Latest Articles