మధ్యాహ్నం గుండ్లపాడుకు చంద్రబాబు..

మాచర్ల టీడీపీ ఇంచార్జీ జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్యను నిన్న రాత్రి కొందరు దుండగులు కత్తులతో, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులోని చంద్రయ్య ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు యత్నించారు.

అయితే బ్రహ్మరెడ్డి వచ్చేవరకు చంద్రయ్య మృతదేహాన్ని తరలించవద్దని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యాహ్నం గుండ్లపాడుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రయ్య మృతదేహం వద్ద నివాళులు అర్పించనున్నారు.

Related Articles

Latest Articles