పెద్దిరెడ్డికి మంత్రిగా ఉండే అర్హత లేదు.. చంద్రబాబు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తన స్వంత జిల్లా, స్వంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలోని సి. బండ్లపల్లెలో అక్రమ మైనింగ్ ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. కుప్పంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఆఖండ సినిమాలో ఇలాంటి మైనింగ్ మాఫియాను చూశానన్నారు.

సినిమాకు మించిన రీతిలో ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. మితిమీరుతున్న అక్రమ మైనింగ్‌ పై గ్రీన్ ట్రిబ్యునల్‌, న్యాయ స్దానానికి,కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈగ్రానైట్ అక్రమ డబ్బులను మున్సిపల్, పంచాయతీ, ఎమ్మెల్యే ఖర్చుపెట్టారు.పెద్దిరెడ్డికి మంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. సిఎం జగన్ దీనిపై స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని పదవి నుండి తొలగించాలని, ప్రజలే దీన్ని అడ్డుకోవావాలన్నారు. ఇదంతా కుప్పం ప్రజల సంపద అన్నారు.

ద్రావిడ వర్శిటిలో 150 ఎకరాలలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఇన్ని జరుగుతుంటే పోలీసులు మైనింగ్ మామూళ్ళు మత్తులో తూగుతున్నారని విమర్శించారు. మాఫియా డాన్ గా మంత్రి పెద్దిరెడ్డి పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలన్నారు చంద్రబాబు.

Related Articles

Latest Articles