ఆర్టీసీ నుంచి వచ్చే జీతం వద్దన్న చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్…

ఆర్టీసీ గౌరవంగా ఇచ్చే జీతభత్యాలు వద్దన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ సంస్థ నుండి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలునని, టీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్థిక భారం మోపడం ఇష్టం లేక తన వంతుగా ఈ నిర్ణయం తీసుకునట్లు తెలియజేసారు. అయితే చైర్మన్ బాజిరెడ్డి టీఎస్ ఆర్టీసీ పై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉదారంగా తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసారు. అయితే తెలంగాణ ఆర్టీసీ ఎప్పటినుండో నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles