ఎంపీలాడ్స్ నిధుల దుర్వినియోగంపై కేంద్రం సీరియస్

ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. నిబంధనలకు అనుగుణంగా నిధులు ఖర్చుచేయలేదని ఫిర్యాదులు అందడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని పేర్కొంది కేంద్రం. ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ.

నిబంధనల అనుగుణంగా ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు చేయకపోవటంపై వివరణ ఇవ్వాలని ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది కేంద్రం. మత పరమైన భవనాల నిర్మాణానికి, మరమ్మత్తుల కోసం ఎంపీలాడ్స్ నిధులు కేటాయించారన్న ఫిర్యాదు మేరకు వివరణ కోరింది కేంద్రం.

ఎంపీలాడ్స్ నిధుల వ్యయాన్ని పర్యవేక్షించాల్సిన రాష్ట్రస్థాయి నోడల్ విభాగం, జిల్లా అధికారులు కూడా నిబంధనలు పాటించడం లేదని కేంద్రం లేఖలో పేర్కొంది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన అన్ని నోడల్ విభాగాలతోనూ ఆడిట్ నిర్వహించి అవి దుర్వినియోగం కాకుండా చూడాలని కేంద్రం సూచించింది.ఎంపీ లాడ్స్ కింద ప్రతి ఎంపీకి కేంద్రం ఏటా 5 కోట్ల నిధులు ఇస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చుచేయాల్సి వుంటుంది.

Related Articles

Latest Articles