ఫ్రీ వ్యాక్సిన్ : కొత్త మార్గదర్శకాలు విడుదల

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు.ఈ ప్రకటన మేరకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
మార్గదర్శకాలు :
దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ లలో 75 శాతం కేంద్రమే కొనుగోలు చేస్తోంది. ఈ టీకాలను రాష్ట్రాలకు, కేంద్ర ప్రాంత ప్రాంతాలకు ఉచితంగా కేంద్రమే పంపిణీ చేస్తుంది.
వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యత ఎలాగంటే.. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడిన పౌరులు, రెండో వేసుకోవాల్సిన వారు, 18 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
18 ఏళ్లు పైబడినవారిలో ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంతంగా నిర్ణయం తీసుకొని వ్యాక్సిన్స్ పంపిణీ షెడ్యూల్ పెట్టాలి.
కేంద్రం అందించే వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాల్లోని జనాభా కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ వృద్ధి లాంటి అంశాలను ఆధారంగా చేసుకొని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయింపు
కోవిన్ నమోదుతో పాటు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలి
కాల్ సెంటర్లు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా వ్యాక్సిన్ ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలి
దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు టీకా తయారీదారుల ఉత్పత్తిలో 25% నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించుకునే అవకాశం.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ గరిష్టంగా 150 రూపాయలు మాత్రమే తీసుకోవాలి దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-