కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. ఆ కేసులు ఎత్తివేత

కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్‌ 66-A ఐటీ చట్టం కింద నమోదైన కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.. రద్దు చేసినా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోషల్‌ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్‌ చేసిన వారిని సెక్షన్‌ 66-A కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. ఈ సెక్షన్‌ ప్రకారం.. నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సెక్షన్‌ 66-Aను రద్దు చేస్తూ నాలుగేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-