కేర‌ళ‌కు క‌రోనా అత్య‌వ‌స‌ర ప్యాకేజీ..

క‌రోనా సెకండ్ వేవ్ కేసులు అన్ని రాష్ట్రాల్లో క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నా.. కేర‌ళ‌లో మాత్రం ఇంకా పెద్ద సంఖ్య‌లోనే పాజిటివ్ కేసులు బ‌య‌ట ప‌డుతున్నాయి.. దీనికి పెద్ద సంఖ్య‌లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డం కూడా కార‌ణంగా చెబుతున్నారు.. అయితే, కరోనా అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ 2 కింద కేరళ రాష్ట్రానికి రూ.267.35 కోట్ల నిధులు కేటాయించినట్లు ఇవాళ ప్ర‌క‌టించారు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా.. ఇవాళ తిరువనంతపురం వెళ్లిన మాన్సుఖ్ మాండవియా.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజయన్‌, ఆరోగ్య మంత్రి వీనా జార్జ్‌, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.. ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితి, తీసుకోల్సిన చ‌ర్య‌ల‌పై ఆరా తీశారు.

కేర‌ళ‌ల‌కు క‌రోనా అత్య‌వ‌స‌ర ప్యాకేజీ కింద‌ రూ.267.35 కోట్లు కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన మా‌న్సుఖ్ మాండ‌వియా.. రాష్ట్ర ఆరోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కోసం ఇది సహాయపడుతుందని చెప్పారు. మెడిసిన్‌ పూల్‌ కోసం ప్రతి జిల్లాకు కోటి చొప్పన అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.. ప్రతి జిల్లాలో టెలీ మెడిసన్ సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఇక‌, కరోనా థర్డ్‌ వేవ్‌పై హెచ్చ‌రికల నేపథ్యంలో ప్రతి జిల్లా ఆసుపత్రుల్లో పిల్లల ఐసీయూ, పది కిలో లీటర్ల ఆక్సిజన్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

-Advertisement-కేర‌ళ‌కు క‌రోనా అత్య‌వ‌స‌ర ప్యాకేజీ..

Related Articles

Latest Articles