భారత్ బయోటెక్‌కు భద్రత పెంపు

క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డిలో ఇప్పుడు వ్యాక్సిన్ల పాత్ర కీల‌క‌మైన‌ది.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయ‌గా.. మ‌రోవైపు.. ఉత్ప‌త్తి కూడా అదే స్థాయిలో జ‌రుగుతోంది.. ఇక‌, ఈ స‌మ‌యంలో.. వ్యాక్సిన్ త‌యారీ చేస్తున్న సంస్థ‌ల ద‌గ్గ‌ర భారీ భ‌ద్ర‌త క‌ల్పిస్తోంది స‌ర్కార్.. ‘కోవాగ్జిన్‌’ తయారు చేస్తోన్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్​ సంస్థకి భద్రత క‌ల్పించారు.. హైదరాబాద్ శామీర్‌పేట్‌లో ఉన్న భారత్​ బయోటెక్​ ప్లాంట్ ద‌గ్గ‌ర సీఐఎస్​ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్కూరిటీ ఫోర్స్)​తో భ‌ద్ర‌త ప‌టిష్టం చేశారు.. పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు ఇక మీదట నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తారు. ఒక ఇన్‌స్పెక్ట‌ర్ స్థాయి అధికారి నేతృత్వంలో భ‌ద్ర‌త కొన‌సాగుతోంది.. ఉగ్రవాదులు ముప్పు నేపథ్యంలో వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థ‌ల ద‌గ్గ‌ర భ‌ద్ర‌త పెంచింది ప్ర‌భుత్వం..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-