కేంద్ర రక్షణశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి విపరీతంగా పెరుగుతోంది. కరోనా వల్ల సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలుసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకోవాలని రాజ్‌నాథ్‌ సింగ్ సూచించారు.

Read Also: ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు

మరోవైపు చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అన్ని దేశాల్లో మరోసారి కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచంతో పాటు మనదేశంలో కూడా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4 వేలను దాటింది. అటు రోజూవారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. దీంతో థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి.

Related Articles

Latest Articles