హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మంత్రి

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే సిద్ధార్ద్ చేసిన ట్విట్‌ను డిలీట్ చేయాలని.. అతడిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రత అంశంలో బీజేపీని విమర్శిస్తూ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌కు సైనా నెహ్వాల్ రిప్లై ఇచ్చింది. ప్రధాని భద్రతకు విఘాతం కలిగిస్తే ఏ దేశం కూడా సురక్షితంగా ఉందని చెప్పుకోదంటూ పేర్కొంది. దీంతో సిద్ధార్థ్ స్పందిస్తూ… ‘సబ్టిల్ కాక్ చాంపియన్ ఆఫ్ వరల్డ్… గాడ్ థ్యాంక్స్.. గాడ్ ఆఫ్ ఇండియా ప్రొటెక్టర్స్ చేతులు ముడుచుకున్నందుకు సిగ్గుపడాలి’ అంటూ ట్వీట్ చేశాడు.

అయితే హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్‌పై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం కలిగిన సైనాపై ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయడం సిద్ధార్థ్ సంకుచిత ధోరణికి నిదర్శనం అని విమర్శించారు. భారత్‌ను క్రీడా శక్తిగా మలచడంలో సైనా అద్భుత భాగస్వామ్యం పట్ల దేశం గర్విస్తోందని… సైనా ఒలింపిక్ పతక విజేత మాత్రమే కాదని, నికార్సయిన దేశభక్తురాలు కూడా అంటూ కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో స్పందించారు.

Related Articles

Latest Articles