క‌రోనాపై కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు…

క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం రోజున 37 వేల‌కు పైగా కేసులు న‌మోదైతే, బుధ‌వారం రోజున 58 వేల‌కు పైగా కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  ఒక్క‌రోజులో దాదాపు 20 వేల‌కు పైగా కేసులు పెరిగాయి.  అనేక రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు అమ‌లు చేస్తున్నారు.  నైట్ క‌ర్ఫ్యూల‌తో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థ‌లు, సినిమా హాళ్లు వంటి వాటిని మూసివేశారు.  కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసింది.  ఐసోలేష‌న్‌ను 10 రోజుల‌కు బ‌దులుగా ఏడు రోజుల‌కు కుదించింది.  వ‌ర‌స‌గా మూడు రోజుల‌పాటు జ్వ‌రం రాకుండా ఉంటే 7 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే స‌రిపోతుంద‌ని కేంద్రం పేర్కొన్న‌ది.   పాజిటివిటీ రేటు ప్ర‌స్తుతం దేశంలో 4.18 శాతంగా ఉంది.  ఇది మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.  దేశంలో థ‌ర్డ్ వేవ్ మొద‌లైంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.  

Read: ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రిక‌: ఢిల్లీలో నేడు 10వేల క‌రోనా కేసులు?

Related Articles

Latest Articles