మొన్న 2 వేల కోట్లు.. తాజాగా 1438 కోట్లు…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్థికంగా కుదురుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పించింది. అప్పులపై ఆధారపడుతూ అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు.. మరో ఉతం అందింది. వచ్చింది చిన్నదైనా.. కనీసం నెలో.. రెండు నెలలో మెయింటైన్ చేయగలిగేలా.. ఆర్థిక వనరులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి 2 వేల కోట్ల రూపాయలను అప్పు రూపంలో జగన్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది.

తాజాగా.. కేంద్రం ఏపీకి 1438 కోట్ల రూపాయలను అందించింది. రెవెన్యూ లోటును భర్తీ చేసే ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ నిధులు అందించింది. 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులతో కలిసి మొత్తంగా 8628 కోట్ల రూపాయల నిధులు అందించినట్టు వెల్లడించింది. అలాగే.. తాజా కోటాలో మరో 17 రాష్ట్రాలకు 9871 కోట్ల రూపాయలు అందించినట్టుగానూ వివరణ ఇచ్చింది.

కేంద్రం ఎలాంటి సందర్భంలో నిధులు మంజూరు చేసినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఇది చాలా విలువైన సహాయంగా చూడాల్సిందే. ప్రతి రూపాయి కీలకం అవుతున్న నేటి తరుణంలో.. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలకు ఈ నిధులు ఎంతో కొంత సహాయంగా నిలిచేవే. వీటితో పాటుగా.. మరింత సంఖ్యలో నిధులు లేదంటే రుణాలు సాధించేందుకు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వివరించారు. ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ సైతం.. తన స్థాయిలో నిధుల సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి వస్తున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం అండ ఇలాగే కొనసాగితే.. రాష్ట్రానికి మంచిదే అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-