విద్యుత్ అంశంపై రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌లు…

దేశంలో బొగ్గు కొర‌త కార‌ణంగా రాష్ట్రాలు విద్యుత్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాయి.  ఈ స‌మ‌స్య‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ది.  రాష్ట్రాల‌కు ప‌లు కీల‌క‌మైన సూచ‌న‌లు చేసింది.  కేంద్రం వ‌ద్ద ఉన్న కేటాయించ‌ని విద్యుత్‌ను వాడుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది.  కొన్ని రాష్ట్రాలు అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ ను విక్ర‌యిస్తున్నాయ‌ని, వినియోగ‌దారుల‌కు ఇవ్వ‌కుండా విద్యుత్‌ను అమ్ముకోవ‌ద్ద‌ని కేంద్రం సూచించింది.  ఎక్కువ ధ‌ర‌ల కోసం విద్యుత్‌ను అమ్ముకునే రాష్ట్రాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్రం హెచ్చ‌రించింది.  కేటాయించ‌ని విద్యుత్‌ను వాడుకునే వెసులుబాటును తొల‌గిస్తామ‌ని కేంద్రం హెచ్చ‌రించింది.  విద్యుత్ ను స‌ర‌ఫ‌రా చేసే బాధ్య‌త డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీల‌దే అని కేంద్రం పేర్కొన్న‌ది.  విద్యుత్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం సెంట్ర‌ల్ జ‌న‌రేటింగ్ కేంద్రం వ‌ద్ద ఏ రాష్ట్రాల‌కు కేటాయించ‌ని 15శాతం విద్యుత్ ఉంటుంది.  ఈ విద్యుత్‌ను కొర‌త ఎదుర్కొంటున్న రాష్ట్రాలు వాడుకోవాల‌ని కేంద్రం తెలిపింది.  అదే విధంగా మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు కొర‌త రాష్ట్రాల‌కు విద్యుత్‌ను అందించాల‌ని కేంద్రం తెలియ‌జేసింది.  

Read: ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌… కాశ్మీర్‌లో ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం…

-Advertisement-విద్యుత్ అంశంపై రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క సూచ‌న‌లు...

Related Articles

Latest Articles