దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. పిల్లలు జాగ్రత్త.. కేంద్రం హై అలర్ట్

మన దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా రోగుల సంఖ్య ఐదుకు చేరింది. ఒమిక్రాన్ విషయంలో అంతా జాగ్రత్తగా వుండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దేశంలోని ఐదుగురు ఒమిక్రాన్ రోగుల లక్షణాలను వైద్యులు పరిశీలించారు. ఢిల్లీలోని ఒమిక్రాన్ రోగికి గొంతు నొప్పి, బలహీనత, శరీర నొప్పి ఉన్నదని ఎల్‌ఎన్‌జేపీకి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు.

ఆ వ్యక్తికి ప్రధానమైన లక్షణాలు లేవని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని చెప్పారు.రెండో ఒమిక్రాన్‌ రోగి అయిన బెంగళూరు వైద్యుడిలో జ్వరం, ఒంటి నొప్పి వంటి తేలికపాటి లక్షణాలను కనుగొన్నారు. మూడో రోగి ముంబై మెరైన్ ఇంజనీర్, నాలుగో రోగి అయిన గుజరాత్ ఎన్‌ఆర్‌ఐకు కూడా తేలికపాటి లక్షణాలు వున్నాయి. వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్‌ వల్ల పెద్ద ముప్పు ఉండబోదని అంచనా వేస్తున్నారు. సుమారు 200 ఒమిక్రాన్‌ కేసులు నమోదైన దక్షిణాఫ్రికాతోపాటు ఈ వేరియంట్‌ వ్యాపించిన 40 వరకు దేశాల్లో ఇప్పటి వరకు దీని వల్ల ప్రాణ నష్టం తక్కువే. అయినా అంతా అప్రమత్తంగా వుండాలని కేంద్రం సూచిస్తోంది.

Related Articles

Latest Articles