ఏపీ దిశా కమిటీలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు చోటు

ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించే దిశా కమిటీలో తనకు స్థానం కల్పించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. దిశా కమిటీలో ‘ప్రముఖ సభ్యుడు’ (ఎమినెంట్ మెంబర్‌)గా తనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నియమించిందని, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఈ కమిటీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు సరిగ్గా జరిగే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ దిశా కమిటీలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు చోటు

Related Articles

Latest Articles