వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని… గత శుక్రవారం పీఎం నరేంద్ర మోడీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకునే ప్రక్రియకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోద ముంద్ర వేసింది. వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకునే ప్రక్రియను పూర్తిచేసిన కేంద్రం… రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉపసంహరణకు సర్వం సిద్ధమైంది.

అలాగే…. మరో 4 నెలల పాటు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్చి 2022 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 53,344.52 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఈ విడతలో 163 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు విడుదల చేయనుంది కేంద్రం. దీని ద్వారా ప్రతివ్యక్తికి ప్రతి నెలా 5 కేజీల ఆహారధాన్యాలు ఉచితంగా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

Related Articles

Latest Articles