కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతులకు కేంద్రం ఆమోదం

UN-మద్దతుగల COVAX గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్‌ లకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ మూడు దేశాలతో పాటు, SII COVAX కింద కోవిషీల్డ్‌ను బంగ్లాదేశ్‌కు కూడా ఎగుమతి చేయనున్నట్టు వారు తెలిపారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII) నవంబర్ 23 నుంచి COVAX ప్రోగ్రామ్ కింద కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతిని ప్రారంభిస్తుందని వెల్లడించారు. నవంబర్ 24న నేపాల్ మొదటి కోవిషీల్డ్‌ను అందుకుంటుందని వారు తెలిపారు.


‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం కింద నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌ లకు ఒక్కొక్కటి 10 లక్షలకు పైగా కోవిషీల్డ్ డోస్‌లను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అక్టోబర్‌లో ముందుగానే SIIకి అనుమతి నిచ్చింది. పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా 24,89,15,000 డోస్‌ల స్టాక్‌ను తయారు చేసిందని, కేంద్ర వైద్యాఆరోగ్య శాఖ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగకు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇటీవలి కమ్యూనికేషన్‌ ద్వారా సమాచారం అందించారు సంస్థ ప్రతనిధులు కోవిషీల్డ్‌ స్టాక్‌ను రోజురోజుకు పెంచుతున్నట్టు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. కాగా వ్యాక్సిన్‌ మైత్రి కార్యక్రమం ద్వారా గతంలో కూడా భారత్‌ వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దీంతో మరోసారి భారత్‌ వ్యాక్సిన్‌ ఎగుమతి దారుగా ప్రపంచ దేశాల సరసన నిలవనుంది.

Related Articles

Latest Articles