కేంద్రం తెలంగాణ ప్రజలను అవమానించింది: ఎర్రబెల్లి దయాకర్‌ రావు


కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం ఢీల్లో కేంద్రమంత్రులు, ప్రధానిని కలి సేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానించిదని ఇది యావత్‌ తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్టానికి ధాన్యం కొనుగోలు విష యంలో స్పష్టత ఉందని, కేంద్రం మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వ డం లేదని ఆయన మండిపడ్డారు. యాసంగికి ఎన్ని సన్న వడ్లు కొం టారు, ఎన్ని దొడ్డు వడ్లు కొంటారో చెప్పాలని ఎన్నో సార్లు అడిగినా కేంద్రం మాత్రం ఇప్పటి వరకు స్పష్టతను ఇవ్వడం లేదన్నారు.

బీజేపీలో చాలామంది వ్యవసాయం చేసిన వాళ్లు లేరు, రైతాంగం సమస్యలు తెలిసిన వాళ్లు కూడా లేరు అందుకే ఇష్టం వచ్చినట్టు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు.రైతు చట్టాలు తెచ్చి పొరపాటు చేశాము అని స్వయంగా ప్రధాన మంత్రి చెప్పిన మీకు బుద్ధి రావడం లేదని రాష్ర్ట బీజేపీ నేతలను ఆయన విమర్శించారు. ఛత్తీస్‌ఘడ్‌లో అక్కడి రాష్ర్ట ప్రభుత్వం ఎంత కొంటుందో తెలుసు కోండి. 20 శాతం ధాన్యం కూడా కొనడం లేదు కానీ సీఎం కేసీఆర్‌ పక్క రాష్ర్టంలోని పంటను కూడా కొన్నారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం పై విమర్శలు మాని రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్రం పై ఒత్తిడి పెంచాలని రాష్ర్ట బీజేపీ నేతలకు ఎర్రబెల్లి దయాకర్‌ రావు సూచించారు.

Related Articles

Latest Articles