కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ కేసు.. కీలక నిందితుడి అరెస్ట్

తెలంగాణ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌కు సైబర్ కేటుగాళ్లు కన్నం వేశారు.. బ్యాంక్ ఖాతాల్లోకి ప్రవేశించి దాదాపుగా రూ.2 కోట్లు కాజేశారు.. అయితే, ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.. బ్యాంక్ మూల ధనం నుంచి రెండు కోట్లు కొట్టివేసిన నైజీరియన్‌ను పట్టుకున్నారు సీసీఎస్‌ పోలీసులు.. దీంతో అపెక్స్ బ్యాంకులో నగదు మాయం కేసులో అరెస్ట్‌ల సంఖ్య రెండుకు చేరింది.. హైదరాబాద్ టోలిచౌకిలో నివాసముంటున్న నైజీరియన్ లేవి డైలాన్ రోవాన్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు సీసీఎస్‌ పోలీసులు.. కాగా, బ్యాంక్​ఖాతాలను హ్యాక్​చేసి.. రూ.1.96 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.. ఈ కేసులో గతంలో అరెస్టైన నిందితులు కమీషన్‌ తీసుకుని నైజీరియన్ కి ఖాతాల వివరాలు ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. బ్యాంక్​మూలధన ఖాతా నుంచి రూ.1.96 కోట్లు… సర్వర్‌లోకి వెళ్లి వివిధ ఖాతాలకు నగదు బదిలీ చేసుకున్నట్లు నిర్ధారించారు.. అకౌంట్స్ ట్రాన్సక్షన్స్ మొబైల్ సిగ్నల్ ఆధారంగా నైజీరియన్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-