భూముల రీసర్వే ప్రాజెక్టు పై సీసీఎల్ఏ కసరత్తు…

భూముల రీసర్వే ప్రాజెక్టును మరింత వేగంగా అమలు చేసేందుకు సీసీఎల్ఏ కసరత్తు చేస్తుంది. సర్వేలో కీలకమైన తాసిల్దార్లు, డెప్యూటీ తాసిల్దార్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్ల బదిలీలతో పాటు సర్వే విభాగంలోని ఉద్యోగుల బదిలీలు చేయాలని భావిస్తుంది సీసీఎల్ఏ. ఇప్పటికే బదిలీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.

రెవెన్యూ, సర్వే విభాగాల్లోని ఉద్యోగుల బదిలీకి 15 రోజుల విండో పిరియడ్ ఇవ్వాలని కోరారు సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే రీసర్వే కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కనీసం మూడేళ్లపాటు బదిలీ ఉండబోదన్న నిబంధన విధించాలని స్పష్టం చేసారు భూపరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్నందున ఈ వెసులుబాటు కల్పించాలని కోరిన సీసీఎల్ఏ… భూముల రీసర్వే ప్రాజెక్టులో సరైన వ్యక్తి సరైన చోట ఉండాలన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు వెల్లడించింది. భూసర్వే కోసం రెవెన్యూ చట్టాల్లో నైపుణ్యమున్న డెప్యూటీ తాసీల్దార్లకు గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసినట్టు పేర్కొంది సీసీఎల్ఏ.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-