వైఎస్ వివేకా ఇంటిని పరిశీలిస్తున్న సీబీఐ అధికారులు…

నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఐదో రోజు సీబీఐ విచారణ జరుపుతుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాంలో విచారణ చేస్తుంది సీబీఐ అధికారుల బృందం. ఇక నిన్న వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి,,కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను 8 గంటల పాటు ప్రశ్నించారు. నేడు విచారణకు వివేకా కుమార్తె సునీత వచ్చే అవకాశం ఉంది. ఇక పులివెందులలో వైయస్ వివేకా ఇంటిని పరిశీలిస్తున్నారు సీబీఐ అధికారులు. వైఎస్ వివేకా ఇంటితో పాటు పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ (అనుచరుడు) ను విచారణ చేస్తున్న సీబీఐ బృందం..ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు స్థానికులతో సమాచారం సేకరిస్తుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-