న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసు.. సీబీఐ మరో ఛార్జిషీట్‌

న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో మరో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది సీబీఐ.. విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు అధికారులు.. ఈ ఛార్జిషీట్‌లో నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ.. ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్, ఆదర్శ రెడ్డి, లవునిరు సాంబశివారెడ్డిలపై అభియోగాలు మోపింది.. ఇక, ఈ కేసులో మరో 16 మంది పేర్లను ఛార్జిషీట్‌లో పొందుపర్చింది సీబీఐ.. కాగా, ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-