వైఎస్ వివేకా హ‌త్యకు రూ.8 కోట్ల సుపారీ.. ఇద్ద‌రు ప్ర‌ముఖుల హ‌స్తం..!

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన మాజీమంత్రి, వైసీపీ నేత‌ వైఎస్‌ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పురోగ‌తి సాధించింది.. ఈ కేసులో సుదీర్ఘ విచార‌ణ కొన‌సాగిస్తున్న సీబీఐ.. వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్‌ రంగయ్య నుంచి కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టింది.. రంగ‌య్య తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్ల‌డించారు.. వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు తెలిపిన ఆయ‌న‌.. ఈ హత్యలో తొమ్మిది మంది భాగంగా ఉన్నార‌ని తెలిపారు. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి ఇంటికి ఐదుగురు కొత్త వ్య‌క్తులు వ‌చ్చార‌న్న రంగ‌య్య‌.. హ‌త్య‌లో ఇద్ద‌రు ప్ర‌ముఖు వ్య‌క్తుల హ‌స్తం ఉన్న‌ట్టుగా తెలిపాడు.. అయితే, ప్ర‌ముఖులు ఎవ‌ర‌నేదానిపై పూర్తి విచార‌ణ చేప‌డ‌తామ‌ని సీబీఐ చెబుతోంది. మొత్తంగా రంగ‌య్య వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీల‌కంగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-