సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌.. తీర్పు ఇచ్చిన సీబీఐ కోర్టు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఇవాళ తీర్పు వెలువరించింది… సీఎం జగన్‌కు, ఎంపీ సాయిరెడ్డికి భారీ ఊరట కలిగిస్తూ.. బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.. కాగా, సీఎం జగన్‌, ఎంపీ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..సీఎం హోదాలో వైఎస్‌ జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని.. ఏ1గా ఆయన సాక్షులను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారంటూ తన పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ రఘురామ.. మొదట సీఎం బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేసిన ఆయన.. ఆ తర్వాత విజయసాయిరెడ్డి బెయిల్‌ కూడా రద్దు చేయాలంటూ మరో పిటిషన్‌ వేవారు.. ఆ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఇవాళ రఘురామ కృష్ణ రాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. తీర్పు వెలువరించింది.

Related Articles

Latest Articles

-Advertisement-