గుంటూరు మాజీ ఎమ్మెల్యేపై సీబీఐ కేసు

గుంటూరు సిటీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై కేసు నమోదు చేసింది సీబీఐ… పొగాకు కొనుగోలు కంపెనీ పేరిట స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) నుంచి రూ.45 కోట్ల రుణాలు తీసుకున్న వెంకట్రావు.. రూ.19 కోట్ల రుణాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు అభియోగాలున్నాయి… బ్యాంకు ఫిర్యాదుతో తాడిశెట్టి వెంకట్రావు, మురళీమోహన్‌పై కేసు నమోదు చేసింది సీబీఐ.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో వెంకట్రావు ఆస్తులపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.. కాగా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసి గెలిచారు తాడిశెట్టి వెంకట్రావు.. గతంలోనే ఆయనపై సీబీఐ కేసు నమోదైనట్టు వార్తలు కూడా వచ్చాయి..

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-