వైఎస్‌ వివేకా హత్య కేసు.. ఆచూకీ చెబితే రూ.5 లక్షల రివార్డు-సీబీఐ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు నిందితులు, అనుమానితులను విచారిస్తోంది సీబీఐ టీమ్.. మరికొందరిని అదుపులోకి కూడా తీసుకుంది.. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎంపీ అవినాష్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ బృందం మరోసారి విచారణకు పిలిచింది. మరోవైపు వివేకా కుమార్తె సునీత మధ్యమధ్యలో సీబీఐ అధికారులను కలుస్తూ కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. ఇక, ఈ కేసులో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది సీబీఐ.. వివేకా హత్య కేసులో నిందితులను పట్టిస్తే రూ.5 లక్షలు రివార్డు ఇస్తామంటూ ప్రకటించింది.

ఈ మేరకు పత్రికా ప్రకటన ఇచ్చింది సీబీఐ.. వివేకా హత్య కేసులో నిందితుల ఆచూకీ చెబితే రూ. 5 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది.. 70 రోజులకు పైగా సీబీఐ దర్యాప్తు జరుగుతోంది… హత్యతో సంబంధం ఉందంటూ సునీల్ యాదవ్ ను అరెస్ట్‌ చేసింది సీబీఐ.. దీంతో.. కేసు ముగింపు దశకు వచ్చిందని అంతా భావిస్తున్న తరుణంలో.. సీబీఐ ప్రకటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. వైఎస్‌ వివేకా ఫోటోను జత చేసి ఇచ్చిన ఈ ప్రకటనలో.. 14 మార్చి 2019 మరాయిఉ 15 మార్చి 2019 మధ్య రాత్రి సమయంలో అతి దారుణంగా ఇంటిలోనే హత్యకు గురయ్యారు.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 09.07.2020న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.. అయితే, ఈ కేసు సంబంధించిన నమ్మకమైన సమాచారం అందించినవారికి అక్షరాల రూ.5 క్షల రూపాయలు బహుమానంగా ఇస్తాం.. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు అతి గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది సీబీఐ.

-Advertisement-వైఎస్‌ వివేకా హత్య కేసు.. ఆచూకీ చెబితే రూ.5 లక్షల రివార్డు-సీబీఐ

Related Articles

Latest Articles