‘క్యాలీఫ్లవర్’ ట్రైలర్: మగాడిది మాత్రం శీలం కాదా..?

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, వాసంతి జంటగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అంది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26 న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. జంతువుకైనా మనుషులకైనా ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతంతో ఉండే గ్రామ పెద్ద ‘క్యాలీఫ్లవర్’.. అనుకోకుండా తన శీలాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి..? తన శీలాన్ని పోగొట్టుకున్న ఆ గ్రామ పెద్ద మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పోరాటం చేస్తాడు. చివరికి తన పోరాటంలో నెగ్గాడా..? లేదా అనేది తెలియాలి. సంపూ తనదైన శైలిలో నటన ఇరగదీశాడు. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో జబర్దస్త్ గెటప్ శ్రీను, రోహిణి, పోసాని కృష్ణ మురళి తదితరులు కనిపించారు. మరి ఈ చిత్రంతో సంపూ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related Articles

Latest Articles