ఘ‌జియాబాద్‌లో చిరుత క‌ల‌క‌లం…

దేశ రాజ‌ధాని ఢిల్లీకి యూపీకి స‌రిహ‌ద్దుల్లో ఉన్న న‌గ‌రం ఘ‌జియాబాద్‌.  24 గంట‌లు జ‌నాలు తిరుగుతూనే ఉంటారు.  క‌రోనా స‌మ‌యంలో త‌ప్పించి ఆ న‌గ‌రంలో నిత్యం ర‌ద్దీ ఉంటూనే ఉంటుంది.  అలాంటి ర‌ద్దీగా ఉన్న న‌గ‌రంలోకి చిరుత ప్ర‌వేశించింది.  ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలియ‌దు.  బుధవారం రాత్రి స‌మ‌యంలో ఇంటి ఆవ‌ర‌ణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రిశీస్తుండ‌గా అర్హన్త్ జైన్ ఇంటి ముందు అనుకోని అతిథి క‌నిపించింది.  

Read: అంత‌రిక్షంలో చంద్రయాన్ 2, నాసా ఆర్బిట‌ర్‌కు తృటిలో త‌ప్ప‌ని ప్ర‌మాదం…

దానిని చూసి మొద‌ట పిల్లి అనుకున్నాడు.  ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన వివిధ సీసీటీవీల ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలించి చూసి షాక‌య్యాడు.  ఇంటి గేటు వ‌ద్ద సంచ‌రించింది పిల్లి కాద‌ని, చిరుత అని గుర్తించాడు.  వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం అందించాడు జైన్‌.  స‌మాచారం అందుకున్న పోలీసులు జైన్ ఇంటికి వ‌చ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలించి చూడ‌గా చిరుతగా గుర్తించారు.  అయితే, ఆ చిరుత ఎటువైపు వెళ్లింది, ఎవ‌రికైనా హాని త‌ల‌పెట్టిందా అనే విష‌యాల‌పై ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Related Articles

Latest Articles