బర్త్ డే స్పెషల్: ‘శశి రేఖ’ గా కేథరిన్

ముద్దుగుమ్మ కేథరిన్ థ్రెసాకు టాలీవుడ్ లో అవకాశాలు బాగానే వున్నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లేకపోవడంతో కాస్త వెనకబాటే వుంది. ‘చమ్మక్ చల్లో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం ఈ బ్యూటీ.. ‘ఇద్దరమ్మాయిలతో, పైసా, సరైనోడు, గౌతమ్ నందా, నేనే రాజు నేనే మంత్రి, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. ఇదిలావుంటే, నేడు కేథరిన్ థ్రెసా పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల అప్డేట్స్ ప్రకటిస్తూ మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం కేథరిన్ నటిస్తున్న ‘భళా తందనాన’ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. పోస్టర్ లో క్యాథరిన్ థ్రెసా పింక్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి చేతిలో మొబైల్ పట్టుకొని బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. శశి రేఖ అనే యువతి పాత్రలో ఆమె కనిపించనుంది. యువ నటుడు శ్రీవిష్ణు హీరో నటిస్తోండగా.. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేథరిన్ ఈ సినిమాతో పాటే ‘బింబిసార’ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-