గల్లా అరుణ, ఎంపీ జయదేవ్ సహా 12 మంది కేసు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి, ప్రస్తుత టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ సహా 12 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. చిత్తూరు జిల్లాలో గల్లా అరుణకుమారి కుటుంబీకుల భూ ఆక్రమణల విషయంలో ఈ కేసులు నమోదు చేశారు.. గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు ఎంపీ గల్లా జయదేవ్, గల్లా రామచంద్ర నాయుడుతో సహా 12 మంది మీద కేసు నమోదైనట్టు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలోని తవణంపల్లి మండలం దిగువ మాగంలో గల్లా అరుణకుమారి తండ్రి పేరు మీద రాజన్న ట్రస్ట్‌ ఏర్పాటు చేవారు.. అయితే, దీని కోసం పెద్ద భవనాలు నిర్మించారు. ఆ భవనాల నిర్మాణం సమయంలో ప్రభుత్వ భూములను ఆక్రమించినట్టు అభియోగాలున్నాయి.. ఈ వ్యవహారంపై తిరుగుబాటు చేశారు స్థానిక నేతలు.. గోపి కృష్ణ అనే రైతు ఏకంగా 2015లోనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి.. ఇది ఇక్కడ తేలేలా లేదని భావించిన గోపి కృష్ణ మరికొంతమంది రైతులతో కలసి కోర్టులో ప్రైవేట్‌ కేసు వేశారు. ఇక, కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ మంత్రి గల్లా అరుణ సహా 12 మందిపై కేసు నమోదు చేశారు తవణంపల్లి పోలీసులు.

-Advertisement-గల్లా అరుణ, ఎంపీ జయదేవ్ సహా 12 మంది కేసు..

Related Articles

Latest Articles