సీఎం తండ్రిపై కేసు.. బ్రాహ్మణులపై వ్యాఖ్యలే కారణం..!

ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ తండ్రి నంద్‌ కుమార్‌ బాఘేల్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు… బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.. కాగా, బ్రాహ్మణులను విదేశీయులుగా పేర్కొన్న నంద్‌కుమార్‌ బాఘేల్‌.. వారిని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు.. అయితే, ఈ ఘటనపై మండిపడ్డ బ్రాహ్మణ సంఘాలు.. నంద్‌ కుమార్‌ బాఘేల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ.. రాయ్‌పూర్‌లోని డీడీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. దాంతో ఆయనపై ఐపీసీ 153-ఏ, 505(1)(బీ) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇక, బ్రాహ్మణులను తమ గ్రామాలలోకి అనుమతించవద్దని ప్రజలకు నంద్‌ కుమార్‌ బాఘేల్‌ పిలుపునిచ్చారని.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది సర్వ్‌ బ్రాహ్మణ్‌ సమాజ్‌ సంస్థ. అంతే కాదు.. శ్రీరాముడిపై కూడా కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.. సీఎం తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.. తక్షణమే ఆయనపై కేసు పెట్టి.. చర్చలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-