బ్రేకింగ్:కారులో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

మైలార్ దేవుపల్లి దుర్గానగర్ చౌరస్తా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధం అయింది. తృటిలో తప్పింది పెను ప్రమాదం. ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు. మైలార్ దేవుపల్లి దుర్గానగర్ చౌరస్తా సమీపంలో కారు వెళుతోంది. అయితే ఆ కారు నడుస్తుండగానే మంటలు చెలరేగాయి.

కారు ఇంజన్ లో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన కార్ డ్రైవర్ ఇక్బాల్ వెంటనే కారు ఆపేశాడు. వెంటనే కారులోంచి బయటకు దిగారు ప్రయాణికులు. కారు పూర్తిగా దగ్ధం అయింది. కారులో మంటలకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Latest Articles