షో రూమ్ మొదటి అంతస్తు నుంచి కింద పడ్డ కారు…

నాగోల్ అల్కాపురి లో గల టాటా షో రూమ్ లో మొదటి అంతస్తు నుంచి కారు కిందపడింది. కారును కొనుగోలు చేసింది మేడిపల్లి కి చెందిన భగవత్ అనే వ్యక్తి. మొదటి అంతస్తులో ఉన్న కారును హైడ్రాలిక్ సిస్టం పై కిందికి తీసుకొనివచ్చి కారు కొనుగోలు చేసిన వ్యక్తికి ఇవ్వాలి షోరూమ్ సిబ్బంది. కానీ మొదటి అంతస్తులో ఉన్న కారును భగవత్ నడిపేందుకు షోరూం సిబ్బంది అనుమతి ఇచ్చారు. కారును స్టార్ట్ చేయడం తో హఠాత్తుగా మొదటి అంతస్తు నుండి హైడ్రాలిక్ సిస్టం పై దూసుకు వచ్చిన కారు… పార్కింగ్ లో ఉన్న కారుతో పాటు బైకుపై పల్టీ కొట్టింది. ఈ కారు నడుపుతున్న భగవత్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అయితే షోరూం సిబ్బంది నిర్లక్ష్యం వలన ఘటన జరిగినట్లు గా గుర్తించిన పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-