ఈ ఫొటోకు క్యాప్ష‌న్ చెప్ప‌గ‌ల‌రా…!

ఫొటో ప‌ర్ఫెక్ట్‌గా వ‌స్తుంద‌ని ఖచ్చితంగా ఎవరూ చెప్ప‌లేరు.  ఇక జంతువులు, పక్షులకు సంబంధించిన ఫొటోలను తీసే ఫొటోగ్రాఫర్లు ఖచ్చితమైన ఫొటోలు వ‌చ్చేవ‌ర‌కు వేచి చూడాల్సిందే.  కొన్ని మాత్రమే అద్భుతం అనిపించే ఫొటోలను తీయగలుగుతారు.  అలాంటి వాటిల్లో ఇదికూడా ఒక‌టి.  గ‌ద్ద ఒక చిన్న కొమ్మ‌ను ప‌ట్టుకొని వెళ్తుండ‌గా,  ఆ కొమ్మ వెనుక భాగంలో మ‌రో న‌ల్ల‌ని ప‌క్షి కూడా కొమ్మ‌ను ప‌ట్టుకొని ఎగురుతున్న‌ది.  చిన్న చిన్న ప‌క్షులు క‌నిపిస్తే వాటిని అమాంతంగా చంపేసి తినేస్తుంటాయి గ‌ద్ద‌లు.  అయితే, వెనుక కొమ్మ‌ను ప‌ట్టుకొని ఉన్న ఆ ప‌క్షి ముందున్న గ‌ద్ద‌కు క‌నిపించ‌లేదు.  ఈ ఫొటోను చూసిన వెంట‌నే చిన్న‌ప్పుడు నీతిక‌థ‌లు పుస్త‌కంలో చ‌దువుకున్న కొంగ‌లు, తాబేలు క‌థ గుర్తుకు వ‌స్తుంది.  ఇలాంటి అరుదైన ఫొటోల‌కు అద్భుత‌మైన క్యాప్ష‌న్ ఉంటే బాగుంటుంది క‌దా. మీకు ఓ మంచి ఐడియా వ‌స్తే త‌ప్ప‌నిస‌రిగా కామెంట్ చేయండి.  

Read: ఎయిర్‌పోర్ట్‌లో విమానాలకు బదులు సైకిళ్లు…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-