ఎయిర్ ఫోర్స్ పైలట్ గా మారిన బాలీవుడ్ లవ్వర్ బాయ్!

కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతోన్న ‘కెప్టెన్ ఇండియా’ మూవీ నుంచీ థ్రిల్లింగ్ అప్ డేట్ వచ్చింది. హీరో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ‘కెప్టెన్ ఇండియా’లో కార్తీక్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో గంభీరంగా దర్శనమిచ్చాడు. అయితే, క్యాప్ చాటున ముఖం దాచేశాడు కార్తీక్! చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ‘కెప్టెన్ ఇండియా’ ఫస్ట్ లుక్ ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది… ‘కెప్టెన్ ఇండియా’ ఓ హిస్టారికల్ అండ్ సక్సెస్ ఫుల్ రెస్క్యూ ఆపరేషన్! కొన్ని వేల మందిని తన ప్రాణాలకు తెగించి కాపాడిన ఓ వీరుడి సాహసం. యదార్థమైన ఘటనల ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు హన్సల్ మెహతా రూపొందిస్తున్నాడు. అద్భుతమైన కథాంశాలతో చిత్రాలు రూపొందించే టాలెంటెడ్ డైరెక్టర్ గా హన్సల్ కు పేరుంది. ఆయన సారథ్యంలో సినిమా చేయటం అదృష్టంగా భావిస్తున్నానని కార్తీక్ ఆర్యన్ అన్నాడు. ‘కెప్టెన్ ఇండియా’ని రోనీ స్క్రూవాలా, హర్మన్ బవేజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-